Gandhapu galini thalupulu aputa nyayama



చిత్రం: ప్రియురాలు పిలిచింది

గేయ రచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్

సంగీతం: ఏ.ఆర్. రెహమాన్

గానం: శంకర్ మహదేవన్

------------------------------------------------------

పల్లవి:

లేదని చెప్ప..నిమిషము చాలు

లేదన్న మాట..తట్టుకోమంటే..

మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె..

ఏమిచేయ..మందువే...


గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ...న్యాయమా..

ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటే..మౌనమా...ఆ.. మౌనమా..

చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే..

అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే..

లేదని చెప్పా నిమిషము చాలు..

లేదన్న మాట తట్టుకోమంటే..

మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా....ఆ... న్యాయమా..

ప్రేమల ప్రశ్నకు...కన్నుల బదులంటే..మౌనమా...ఆ... మౌనమా...

చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే..

అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే..

లేదని చెప్పా నిమిషము చాలు...

లేదన మాట తట్టుకోమంటే...

మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..


చరణం 1:

హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని..

తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ

బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి..

అద్దాల ఊయల బింబమూగె చెలీ..

నువ్వు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా..

నా జీవితం నీ కనుపాపలతో..వెంటాడీ ఇక వేటాడొద్దే..


లేదని చెప్పా నిమిషము చాలు..

లేదన్న మాట తట్టుకోమంటే..

మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే..


గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ...న్యాయమా..

ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటే..మౌనమా...ఆ.. మౌనమా..


చరణం 2:

తెల్లారిపోతున్నా..విడిపోని రాత్రేది..

వాసనలు వీచే.. నీ కురులె సఖీ..ఈ..ఈ..ఈ

లోకాన చీకటయినా..వెలుగున్న చోటేది..

సూరీడు మెచ్చే నీ కనులె చెలీ..ఈ..ఈ..ఈ

విశ్వసుందరీమణులే వచ్చి..నీ పాదపూజ చేస్తారే..

నా ప్రియ సఖియా..ఇక భయమేలా..నా మనసెరిగి నాతోడుగా రావే..


ఏమి చేయమందువే... ఏమి చేయమందువే...

ఏమి చేయమందువే...ఏ.. ఏమి చేయమందువే..ఏ...

న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ..ఆ

ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..

ఏమి చేయమందువే..ఏ... ఏమి చేయమందువే..ఏ...

మౌనమా..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ

ఏమి చేయమందువే...


Comments

Popular posts from this blog

Evari Gathi Etulunnado Eswarudikeruka Lyrics in Telugu (ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక)

Prema Oh Prema Song Lyrics in Telugu- Jatha Kalise Movie